అనంతపురం జిల్లా జెరుట్లరాంపురం గ్రామానికి చెందిన సరోజమ్మకు కుటుంబ సమస్యలున్నాయి. ఈ కారణంగా కొద్దిరోజులుగా మానసిక క్షోభకు గురై... శనివారం సాయంత్రం తన నలుగురు పిల్లలు... కూతురు మానస (11) సోనీ(09) పల్లవి (07) కుమారుడు డేవిడ్ రాజు (14 నెలలు)కు పురుగుల మందు తాగించింది. అనంతరం తానూ సేవించింది. గమనించిన సమీప బంధువులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నలుగురు పిల్లలకు విషమిచ్చి..ఆపై తానూ సేవించిన తల్లి - Anantapur crime news
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జెరుట్లరాంపురం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ తల్లి తన నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తానూ సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ ఐదుగురిని వారి బంధువులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
నలుగురు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తానూ సేవించిన తల్లి