అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా... రూ. 1,52,620 లక్షల విలువగల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన ముగ్గురు... కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి టాటా సుమోలో గుట్ఖాను తరలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని ఎస్ఐ గోపి తెలిపారు.