ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట - plastic brick experiment in urvakonda news

ఓ ఉపాధ్యాయురాలు.. ఇద్దరు విద్యార్థులు... ప్లాస్టిక్​పై చేసిన ప్రయోగం జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ప్రకృతికి మేలు చేసే ఉన్న ఈ ప్రయోగం.. మరో మైలురాయికి అడుగు దూరంలో నిలిచింది. ఆ వివరాలేంటే మీరూ తెలుసుకోండి.

plastic brick experiment in urvakonda
ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట

By

Published : Jan 1, 2020, 10:30 AM IST

ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట

ప్లాస్టిక్​తో ప్రపంచం మమేకమైపోతోంది. ఇదే ప్లాస్టిక్.. పర్యావరణాన్ని విపరీతంగా కలుషితం చేస్తోంది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇద్దరు విద్యార్థులతో ఓ ఉపాధ్యాయురాలు చేసిన ప్రయోగం.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అనంతపురం జిల్లా ఉరవకొండ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ, ఎనిమిదో తరగతి చదువతున్న విశ్వాస్, కమలనాథ్​... ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద పేరుకు పోకుండా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ప్రయోగం రూపంలో అమల్లో పెట్టారు.
ప్లాస్టిక్ కవర్లను సేకరించి, ఓ గోళంలో కరిగించారు. ఆ ప్లాస్టిక్​ను కంకర, ఇసుక సిమెంటతో కలిపి ఇటుకులు తయారు చేశారు. ఇవి మామూలు ఇటుకుల కంటే దృఢంగా ఉన్నాయి. ఇటీవల జరిగన జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో వీటిని ప్రదర్శించగా.. ప్రశంసలు అందుకుంది. డిసెంబర్​లో కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలకూ ఎంపికైంది.
ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని తీసుకురావటమే తమ లక్ష్యం అని ముక్త కంఠంతో చెప్తున్న ఈ ఉపాధ్యాయిని, విద్యార్థుల కృషి అభినందనీయం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details