అనంతపురం జిల్లా తాడిపత్రి యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో "ఈనాడు-ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యవరణానికి కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధించాలని విద్యార్థులు ఫ్లకార్డులు చేతపట్టి వీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ బదులుగా జూట్ కవర్లను వినియోగించాలని కోరారు.
ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన - plastic ban students rally at tadipathri newsupdates
ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు "ఈనాడు - ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు.

ప్లాస్టిక్ వద్దు పర్యవరణమే ముద్దు విద్యార్థుల ర్యాలీ