హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని శ్రీ సత్యసాయి జిల్లాగా, ఆ జిల్లా ప్రధాన కేంద్రాన్ని పుట్టపర్తిగా ప్రభుత్వం పేర్కొనడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హిందూపురం అఖిలపక్ష కమిటీ కన్వీనర్ టి.బాలాజీ, మనోహర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి , అనంతపురం జిల్లా కలెక్టర్ , కదిరి అర్జీవో , శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్కే రత్నాకర్ తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని హిందూపురం జిల్లాగా ప్రకటించాలని , జిల్లా కేంద్రాన్ని హిందూపురంనే ఉంచాలన్నారు. ఎన్నికలకు పూర్వం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ హిందూపురాన్ని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దానికి కట్టుబడి ఉండాలన్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం.. విధాన పరమైన నిర్ణయం తీసుకుందన్నారు. అందుకు భిన్నంగా జిల్లా కేంద్రాన్ని పుట్టవర్తిలో ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తిలో జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ కోరారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రం ప్రకటించాలని హైకోర్టులో పిల్ - హిందూపురాన్ని జిల్లా కేంద్రం ప్రకటించాలని హైకోర్టులో పిల్
హిందూపురాన్ని జిల్లా కేంద్రం ప్రకటించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం.. విధాన పరమైన నిర్ణయం తీసుకుందన్నారు. అందుకు భిన్నంగా జిల్లా కేంద్రాన్ని పుట్టవర్తిలో ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు.
High Court