మానవతా విలువలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో... ఓ వరాహానికి పాలిచ్చి ఆకలి తీర్చిందో శునకం. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బోయవీధిలో జరిగింది ఈ ఘటన. వరాహానికి పాలిస్తున్న దృశ్యాన్ని స్థానికులు ఎంతో ఆసక్తిగా గమనించారు. జాతి వైరాన్ని మరిచి... వరహానికి అమ్మలా ఆకలి తీర్చిన దృశ్యం గుండెల్ని హత్తుకునేలా ఉంది. ఒక జీవి ఆకలి తీర్చేందుకు జాతి అడ్డుకాదని శునకం నిరూపించింది. కుక్కకు భయపడి అమడ దూరం పరిగెత్తే వరాహాం.. ఎంచక్కా పాలు తాగి ఆకలి తీర్చుకుంది.
హమ్మయ్యా... ఆకలి తీర్చింది..! - వరాహనికి పాలిచ్చిన శునకం న్యూస్ అనంతపురం
ఆకలి తీర్చడానికి అమ్మ అయితే చాలు. జాతీతో సంబంధం లేదు. మానవ విలువలు కనుమరుగవుతున్న వేళ... నీతిని బోధించిందో శునకం. తన అమ్మతనంతో వేరే జాతి జంతువు ఆకలి తీర్చింది.
pig gave milk to dog