పిడుగుపాటుకు గురై రైతు మృతి
పిడుగుపాటుకు గురై రైతు మృతి - yarla gandi
పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న రైతును మృత్యువు కబళించింది. గార్లదిన్నె మండలంలో ఆదివారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. యర్రగుంట్ల గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ పొలానికి వెళ్లి వస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై మరణించాడు.

పిడుగుపాటుకు గురై రైతు మృతి
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ(55) అనే రైతు పిడుగుపాటుకు గురై చనిపోయాడు. ఆదివారం రాత్రి పొలం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఎంతసేపటికి లక్ష్మీనారాయణ ఇంటికి రాకపోయేసరికి.. వెదుకుతూ పొలానికి వచ్చిన కుటుంబ సభ్యులకు మృత దేహం కన్పించింది.