ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్మాను దానం చేసిన పీహెచ్​సీ వైద్యుడు - కరోనా వైరస్​ వార్తలు

ఉరవకొండ మండలం కౌకుంట్ల పీహెచ్​సీలో వైద్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ రంజిత్​ ప్లాస్మా దానం చేశారు. . కొవిడ్‌ చికిత్సలో కీలకమైన ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన డాక్టర్‌ రంజిత్ ను తోటి వైద్యులు అభినందించారు.

uravakonda anantapur district
uravakonda anantapur district

By

Published : Aug 16, 2020, 7:49 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల పీహెచ్​సీలో వైద్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ రంజిత్​ ప్లాస్మా దానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ప్లాస్మాను దానం చేసి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. కరోనా బారిన పడి కోలుకున్న డాక్టర్ రంజిత్....బత్తలపల్లి ఆస్పత్రిలో కరోనా రోగికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న రంజిత్ వెంటనే.... ప్లాస్మాను దానం చేశారు.

ప్లాస్మా దానం వల్ల కరోనా బాధితుల ప్రాణాలను నిలబెట్టవచ్చు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ చికిత్సలో కీలకమైన ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన డాక్టర్‌ రంజిత్ ను తోటి వైద్యులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details