ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషం తాగి వ్యక్తి ఆత్మహత్య - అనంతపురంలో వ్యక్తి ఆత్మహత్యఅనంతపురంలో వ్యక్తి ఆత్మహత్య వార్తలు

విషం తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం రాచనపల్లిలో జరిగింది. అనారోగ్యం కారణంగా అతడు బలవన్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

person suicide in ananthapuram
విషం తాగి వ్యక్తి ఆత్మహత్య

By

Published : Aug 9, 2020, 12:36 AM IST

అనంతపురం గ్రామీణం రాచనపల్లికి చెందిన ఓ వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకర్ రెడ్డిని భార్య వదిలేయటంతో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురికావటంతో సోదరి సంరక్షణలో ఉంటున్నాడు. అయితే వ్యాధి తీవ్రత అధికమవటంతో సోదరికి భారం అవుతానని భావించాడు. అదే ఆలోచనతో జాతీయ ఉద్యానవనం సమీపంలో విషం తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details