అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్సై యువరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జయరామ్ అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తూ కొన్ని రోజుల కిందట పోలీసులకు చిక్కాడు. అతనిపై కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం రాత్రి అతను స్టేషన్కు వచ్చి తన బైక్ ఇవ్వాలని కానిస్టేబుల్ను బెదిరించాడు. కుదరదు అని చెప్పటంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.