అనంతపురం జిల్లా శెట్టూరు మండల పరిధిలోని లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన యువకుడు కొల్లప్ప.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో తాపీ పని చేశాడు. తనకు రావాల్సిన ఒకటిన్నర లక్ష రూపాయలను సంబంధిత వ్యక్తుల నుంచి ఇప్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఎస్సై సానుకూలంగా స్పందిస్తున్నా హెడ్ కానిస్టేబుల్ మాత్రం తరచూ తనను వేధిస్తున్నాడని, మోటార్ సైకిల్ కూడా పని చేసిన చోటే ఉండి పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - person sucide attempt infront of ps news
తాను కష్టపడి పని చేసినందుకు రావలసిన సొమ్మును ఇప్పించాలని పోలీస్ స్టేషన్ ఆశ్రయించినా.. అవమానాలకు గురి చేస్తున్నారని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
TAGGED:
person sucide attempt news