కూడేరు ఎస్సీ కాలనీకి చెందిన కిష్టప్ప అనే వ్యక్తి.. తన ఇంటి ముందు.. అధికారులు రస్తా వేసేందుకు ప్రయత్నించగా ఆవేదనకు గురయ్యాడు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రస్తా ఉన్నట్లు గుర్తించిన అధికారులు రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించగా.. ఆ స్థలం తనకు చెందినదే అని కిష్టప్ప చెప్పాడు.
తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎస్సీ కాలనీలో ఓ ఇంటి ముందు రస్తా విషయంలో వివాదమైంది. ఈ కారణంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలోనే.. కిష్టప్ప అనే వ్యక్తి ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు.
తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. రికార్డుల ప్రకారం అది రోడ్డు అని అధికారులు కిష్టప్పకు చెప్పారు. మనస్థాపానికి గురైన కిష్టప్ప తనతో తెచ్చుకున్న పురుగులమందును అక్కడే తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిష్టప్పను స్థానికులు 108 వాహనంలో అనంతపురం తరలించారు.
ఇదీ చదవండి:'కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అమరావతి ఐకాస నేతలు'