ఉరవకొండ ఆర్టీసీ డిపో ప్రాంగణం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. డిపో సిబ్బంది గమనించి అతడిని లేపే ప్రయత్నం చేయగా చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు అరా తీశారు.
అతడి వద్ద ఉన్న బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డ్ ఆధారంగా విడపనకల్ మండలం ఉండబండ గ్రామానికి చెందిన టీ. గోపాల్ గా గుర్తించారు. ఇతని కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల క్రితమే ధర్మవరంలో స్థిరపడ్డారు. గోపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉండబండ గ్రామంలో ఉన్న తన పొలం, బ్యాంకు పని మీద ఉరవకొండకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.