అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి.. వేట కొడవలితో నరికి చంపారు. చిన్న కొట్టాల కాలనీకి చెందిన రామప్ప అతని కుమారుడు రాజాకు.. పెద్ద కొట్టాల కాలనీకి చెందిన కాటమయ్యకు రహదారిపై అడ్డుగా వేసిన కంచె విషయంలో వివాదం నెలకొంది. కంచె తొలగించేందుకు వెళ్ళిన రామప్ప, రాజాపై.. కాటమయ్య అతను వర్గీయులు దాడి చేశారు. అనంతరం పరస్పరం దాడి చేసుకున్నారు. కొడవళ్లతో దాడి ఘటనలో కాటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రామప్ప, రాజా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాల్ని పరిశీలించిన బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
కంచె వెనుక కథ.. బలైన ప్రాణం - today crime news in ananthapuram
చిన్న విషయమై గొడవ వచ్చింది. మాటామాటా పెరిగింది. వేట కొడవళ్లకు పని చెప్పారు. ఓ ప్రాణాన్ని బలిచేశారు. కొందరు గాయాలతో బయటపడ్డారు. అసలేం జరిగింది?

Person killed in sickle attack at bathalapalli in ananthapuram