అనంతపురంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదర్శ్‌నగర్‌కు చెందిన వెంకటరమణ పని నిమిత్తం రామ్‌నగర్ వెళ్లాడు. సమీపంలోని రైల్వే గేట్‌ను దాటుతుండగా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటరమణ 30వ డివిజన్ తెదేపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి - అనంతపురంలో రైలు ప్రమాదాలు
రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన అనంతపురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![అనంతపురంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి person died in train accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9868240-573-9868240-1607880502723.jpg)
రైలు ఢీకొని వ్యక్తి మృతి