అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన నాగరాజు(23) ఈనెల 14న గుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కరోనా నిర్ధరణ పరీక్ష అనంతరం మృతదేహాన్ని అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. స్వగ్రామంలో యువకుడి అంత్యక్రియలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగిన రోడ్దు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని భార్య ఆరు నెలల గర్భిణీ. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. భర్త ఇక తిరిగి రాడని తెలిసి ఆ గర్భిణీ గుండెలవిసేలా విలపించింది.
person died in anantapur dst urvakonda
ట్యాక్సీ నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ యువకుడు విజయవాడలో ఉన్న మిత్రులను స్వగ్రామాలకు తీసుకురావడానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. మృతుడికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. భార్య ఆరు నెలల గర్భిణీ. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి