విద్యుదఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం రాకుంటపల్లిలో జరిగింది. ఉపాధి కోసం తిరుపతికి వెళ్లి అక్కడే స్థిరపడిన రాకుంటపల్లి వాసి రామకృష్ణ తల్లిని చూసేందుకు సొంత ఊరికి వచ్చారు. ఇంట్లో విద్యుత్ దీపం వెలుగని విషయాన్ని గుర్తించిన అయన మరమ్మతు చేసేందుకు ప్రయత్నం చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే రామకృష్ణ మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు తల్లికి సమాచారం ఇచ్చారు. తనను చూసేందుకు వచ్చిన కుమారుడు అనంత లోకాలకు చేరడాన్ని జీర్ణించుకోలేని తల్లి గుండెలు పగిలేలా రోదించింది.
అమ్మను చూడడానికి వచ్చి.. అంతలోనే అనంతలోకాలకు... - shot circuite died news in anantapur dst
కన్నతల్లిని చూసేందుకు వచ్చిన ఆ యువకుడు అమ్మను చూడకుండానే అనంతలోకాలకు వెళ్ళాడు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చిన తల్లి విగతజీవిగా మారిన కొడుకును చూసి గుండెలు పగిలేలా రోదించింది. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
person died in anantapur dst due to short circuit