అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామ శివారులోని రెండు తాటిచెట్లపై పిడుగు పడి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ దృశ్యాన్ని చూస్తూ పక్కనే ఉన్న కృష్ణమూర్తి(45) అనే రైతు భయంతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి రైతులు చికిత్స కోసం పామిడి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పిడుగు పడి రెండు చెట్లు దగ్ధం..భయంతో వ్యక్తి మృతి - person died news in anantapur dst
చెట్లపై పడిన పిడుగును చూసి భయపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పెద్దవడూగూరు మండలం తెలికి గ్రామంలో జరిగింది.
person died in anantapur dst due to see the Thunderbolt directly