అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన అన్నగారి కొండారెడ్డి అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కొండారెడ్డి వద్ద అమ్మకానికి ఉన్న బియ్యాన్ని కొనేందుకు.. ముగ్గురు వ్యక్తులు రేగాటి పల్లి గ్రామానికి వచ్చారు. అక్కడ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద వీరంతా విందు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం మత్తులో కొండారెడ్డి బావిలో జారిపడ్డాడని పోలీసులకు తెలిపారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధర్మవరం పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు బావిలో మృతదేహాన్ని వెలికతీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో మృతదేహం.. ధర్మవరంలో కలకలం - person death in fell down water pool at Anantapur
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో కొండారెడ్డి అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో జారిపడిపోయాడని అతనితో విందు చేసుకున్న ముగ్గురు వ్యక్తులు చెబుతుండగా పోలీసులు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అనంతపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి