ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - suicide news in anantapur dst

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో రామచంద్ర అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుబం కలహాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

person committed sucide in anantapur dst
person committed sucide in anantapur dst

By

Published : Aug 16, 2020, 5:06 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో రామచంద్ర అనే వ్యక్తి కొంత కాలంగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. మాట మాట పెరిగి ఆవేశంతో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇరుగుపొరుగు వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కమ్మదూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉందని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలం నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details