అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్లో మద్యం తాగిన యువకుడు కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు యువకుడిని అడ్డుకున్నారు. బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను ఎత్తుకెళ్లేందుకు ఒకటి రెండు సార్లు తనని వెంబడించారని చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుని ఆగడాలకు... స్థానికుల దేహశుద్ధి - kadiri
అనంతపురం జిల్లా కదిరిలో మద్యం మత్తులో బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
యువకుని ఆగడాలకు... స్థానికుల దేహశుద్ధి