అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ శివార్లలో ఉన్న యల్ త్రీకాలనీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే కింది వంతెనల రహదారులపై పది అడుగుల మేర నీరు నిలిచింది. కాలనీ ప్రజలు పట్టణంలోకి వెళ్లేందుకు రెండు దారులు మూసుకుపోయాయి. రైల్వే ట్రాక్ దాటుకొని ప్రమాదకరంగా రాకపోకలు చేయాల్సి వస్తోంది. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిని పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ..పడరాని పాట్లు పడుతున్నారు. వంతెనల కింద నీటిని తొలగించమని అధికారులకు తెలిపినా... పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర్మవరంలో ఆ రోడ్డు దాటాలంటే ఈత రావాల్సిందే! - peoples crossing railway tracks due to the railaway bridges filled with water at dhramavaram
వర్షాలతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. ధర్మవరం కాలనీలోకి వెళ్లేందుకు ఉన్న రెండు రైల్వే కింది వంతెనల రహదారులలో నీరు నిండటంతో..ప్రజలు రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర నడకలు సాగిస్తున్నారు.
![ధర్మవరంలో ఆ రోడ్డు దాటాలంటే ఈత రావాల్సిందే!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4558179-297-4558179-1569490876382.jpg)
L THREE is located on the outskirts of the Dharmavaram town in the Anantapur district