ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పని చేయని ఆధార్​ కేంద్రాలు..ప్రజలకు తప్పని ఇబ్బందులు - Aadhaar centers news

ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా.. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో కచ్చితంగా ఆధార్ వివరాలను అనుసంధానం చేస్తోంది. ఆధార్ కార్డులో నమోదైన చరవాణి సంఖ్యకు సంక్షిప్త సమాచారాన్ని పంపుతుంది. దీంతో అనేకమంది ప్రస్తుతం ఆధార్ కార్డులకు తమ చరవాణి సంఖ్యను అనుసంధానం చేయించుకోవడానికి, చిరునామా ఇతరత్రా మార్పుల కోసం ఆధార్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. జనాభాకు తగిన స్థాయిలో కేంద్రాలు లేకపోవడం, ఉన్నవి సక్రమంగా పని చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Aadhaar centers
ఆధార్​ కేంద్రాల వద్ద వేచి చూస్తున్న ప్రజలు

By

Published : Dec 7, 2020, 6:52 PM IST

అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఆధార్ కార్డు మార్పులు చేర్పుల కోసం వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఎస్​బీఐ ప్రధాన శాఖలో, తపాలా కార్యాలయంలో ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. చాలా రోజులుగా ఎస్​బీఐలోని ఆధార్ కేంద్రం మాత్రమే పని చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలే కాకుండా ఇతర మండలాలకు చెందినవారు వందల సంఖ్యలో అక్కడకు వస్తున్నారు. రోజుకు 40 మందికి మించి వివరాలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిమిత సంఖ్యలో టోకెన్లు జారీ చేయటంతో వేచి చూడాల్సి వస్తుందని ప్రజలు నిరాశకు గురవుతున్నారు. తపాలా కార్యాలయంలోని కేంద్రాన్ని అధికారులు వెంటనే ప్రారంభించాలని జనం కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details