ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రజలు బారులు తీరారు. ఆరు నెలల పాటు నిలిచిపోయిన ఆధార్ కేంద్రాలు... 2 రోజుల నుంచి తెరవటంతో ఒక్కసారిగా ప్రజలు తరలివచ్చారు. వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావటంతో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు భౌతిక దూరం మరచి గుంపులు గుంపులుగా బారులు తీరారు. వారిని వారించడం పోలీసులకు కష్టతరమైంది. చివరికి ఆధార్ కేంద్ర నిర్వాహకుడు టోకెన్ పద్ధతిలో సమయాన్ని కేటాయిస్తామని చెప్పటంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఆధార్ కార్డులో మార్పుల కోసం ఎగబడ్డ జనం - updates on aadhar correction
ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అనంతపురం జిల్లా హిందూపురంలో జనం ఎగబడ్డారు. రెండు రోజుల నుంచే ఆధార్ కేంద్రాలు తెరుచుకోవటంతో వందల సంఖ్యలు ప్రజలు చేరుకున్నారు.
ఆధార్ కార్డులో మార్పుల కోసం ఎగబడ్డ జనం