అనంతపురం జిల్లా మడకశిరలో కరోన పాజిటివ్ కేసులు రావటంతో పట్టణంలోని ఆర్యపేట విధిని రెడ్ జోన్‌గా ప్రకటించి ఆ ప్రాంతాన్ని అధికారులు కట్టడి చేశారు. దాదాపు 31 రోజులైన ఆ ప్రాంతంలో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు.
విసిగిపోయిన ఆ ప్రాంతవాసులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు పూట గడవడం కష్టంగా మారిందని వాపోయారు. బయటకు వెళ్ళలేక చేతిలో డబ్బులు లేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.