అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్టుకూరు గ్రామ సమీపంలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తుంది. ఊరి శివారులోని కొండ ప్రాంతాల్లో తిరుగుతూ కుక్కలను వేటాడి చంపిందని గ్రామస్థులు చెబుతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. కొండపైన చిరుత సంచరిస్తున్న సమయంలో స్థానికులు చరవాణిలో చిత్రాలు తీశారు. క్రూర మృగాన్ని బంధించి అటవీ అధికారులు రక్షణ కల్పించాలని రైతులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
చిరుత సంచారంతో భయాందోళనల్లో ప్రజలు
అరణ్యంలో ఉండాల్సిన క్రూర మృగాలు గ్రామాల సమీపంలో సంచరిస్తున్నాయి. ఊర్లకు దగ్గర్లోని కొండప్రాంతాల్లో తిరుగుతూ కనపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
చిరుత సంచారం