ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాధ్యతలు స్వీకరించి... 12 మందిని అరెస్ట్​ చేసి! - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో మడకశిర పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించారు. ఓ చోట అక్రమంగా మద్యం టెట్రా ప్యాకెట్లు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు. మరో చోట పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

arrest
బాధ్యతలు స్వీకరించి ... 12 మందిని అరెస్ట్​ చేసి...

By

Published : Dec 23, 2020, 1:35 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్​లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శేషగిరి... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించారు. మండలంలోని మణూరు గ్రామంలో 25 మద్యం టెట్రా ప్యాకెట్లు కలిగిన నారాయణప్ప అనే వ్యక్తిని అరెస్టు చేసి సరుకు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. జమ్మానిపల్లి, కోనప్పపాలెం గ్రామాల శివారు ప్రాంతంలో జూదమాడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17వేల 480 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details