అనంతపురం జిల్లా నార్పలలో వైన్ షాపులకు మందు బాబులు భారీగా తరలివచ్చారు. మాస్క్ వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. మద్యం రేటు 25 శాతం పెరగడం వల్ల ధరల జాబితా రాలేదని అధికారులు తెలిపారు. చివరికి అమ్మకాలు ప్రారంభం కాని కారణంగా.. మద్యం ప్రియులు వెనుదిరిగారు.
వైన్ షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు - అనంతపురం జిల్లా తాజా మద్యం వార్తలు
నార్పల మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు తెరిచే వైన్ షాపులకు ప్రజలు భారీగా వచ్చారు. మద్యం రేటు పెరగడం వల్ల ధరల జాబితా రాకపోవడం వల్ల.. అమ్మకాలు లేక జనం వెనుదిరిగారు.
మద్యం షాపుల వద్ద గుమిగూడిన జనం