అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. రుణాల కోసం వచ్చిన జనం... బ్యాంకు వద్ద గుమిగూడారు.
అధికారులు మొత్తుకొని.. లైన్లో నిలబెట్టినా... వారి దారి వారిదే అన్నట్టు వ్యవహరించారు. ఎవరి నుంచైనా కరోనా వస్తే పరిస్థితి ఏంటని బ్యాంకు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు.. తమకు సహకరించాలని కోరారు.