ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 27, 2020, 5:27 PM IST

ETV Bharat / state

మార్కింగ్​లు వేసినా మార్పు రాలేదు...!

ముఖ్యమంత్రి జగన్​ ఆదేశాలతో కూరగాయల మార్కెట్​ల వద్ద మార్కింగ్​లు ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఈ మార్కింగ్​లను వేశారు. కొన్నిచోట్ల ప్రజలు వీటిని బేఖాతరు చేస్తున్నారు. కూరగాయలు కొనేందుకు గుమిగూడుతున్నారు.

People do not maintain social distancing in raithu bazaars
People do not maintain social distancing in raithu bazaars

మార్కింగ్​లు వేసినా మార్పు రాలేదు!

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలని పదేపదే అధికారులు, వైద్యులు సూచిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రైతు బజార్లలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. లాక్​డౌన్ నేపథ్యంలో రైతు బజార్లు, విశాలమైన మైదానాల్లో ఉదయం పూట కూరగాయలు విక్రయిస్తున్నారు. ప్రజలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున సామాజిక దూరం పాటించాలంటూ అధికారులు అక్కడ మార్కింగ్​లు చేశారు.

అనంతపురం జిల్లా మడకశిరలో పట్టణ నడిబొడ్డున ఉన్న మార్కెట్​లోనూ ఈ మార్కింగ్​లు వేశారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు ఈ పద్ధతిని పాటించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించడం మాని కూరగాయలు కొనేందుకు గుమిగూడతున్నారు. కూరగాయల కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి సిబ్బంది లేకపోవటం కారణంగా ఈ ధోరణి ఏర్పడింది. అధికారులు మేల్కొని ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.
ఇదీ చదవండి:పెరవలి ఎస్​ఐ ఓవరాక్షన్​పై డీజీపీ ఆగ్రహం​..సస్పెన్షన్​ వేటు

ABOUT THE AUTHOR

...view details