ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇలాగైతే కరోనాకు పండగే! - హిందూపురంలో గుంపులుగా జనం

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నా ప్రజలు నిర్లక్ష్యం వీడడంలేదు. హిందూపురంలో వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చిన జనం దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. ఇలాగైతే వైరస్ మరింత ఉద్ధృతంగా విస్తరించే అవకాశముందని పలువురు అభిప్రాయపడ్డారు.

people crowd in corona time in ananthapuram district
గుంపులు గుంపులుగా జనం

By

Published : Jul 31, 2020, 11:29 AM IST

కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతున్నా కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. మార్కెట్లు, రహదారులపైకి వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించడం లేదు. మహమ్మారి ముప్పును మరిచి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో గురువారం కనిపించిన ఈ రద్దీ దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందూపురంలో వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చిన జనం దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో జనసంద్రం జాతరను తలపించింది.

ABOUT THE AUTHOR

...view details