ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వైరస్ నిర్ధరణ కోసం ఎదురుచూపులు..! - అనంతపురం జిల్లా వార్తలు

కరోనా వైరస్ నిర్ధరణ కోసం రెండు మూడు రోజులపాటు ఎదురుచూడాల్సి వస్తోంది. ఒక వైపున మహమ్మారి విస్తారంగా వ్యాపిస్తున్నా.. మరోవైపు నిర్ధరించుకోవడం కోసం ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

kadiri
kadiri

By

Published : May 3, 2021, 3:25 PM IST

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల పరిధిలో కరోనా పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పరీక్షలు చేయాల్సిన కిట్లు అందుబాటులో లేని కారణంగా... శుక్రవారం నుంచి వచ్చిన వారి వివరాలను మాత్రమే నమోదు చేసుకుంటున్నారు.

సోమవారం పెద్ద సంఖ్యలో కరోనావైరస్ పరీక్షలు నిర్థరణ కోసం ఆస్పత్రికి వచ్చారు. వారి వరుస ఎక్కువగా ఉండడం, జనం గుమిగూడటం, వివరాలు చెప్పేందుకు ఎగబడుతుండటం వల్ల వారిని నియంత్రించడం సిబ్బంది కష్టంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details