అనంతపురం జిల్లా హిందూపురం లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమితులైన బీకే పార్థసారథికి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. పార్థసారథిని పూలమాలలతో సన్మానించారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులు..
ప్రస్తుత వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి.. బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో ఎన్నో పరిశ్రమలు వస్తే.. జగన్ సర్కార్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.