ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షం వస్తే.. మురుగునీరు ఇళ్లల్లోకి చేరుతోంది.. - Sewage problem in Guntakallu

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలను మురుగు సమస్య వెంటాడుతోంది. చిన్నపాటి వర్షానికే లోత‌ట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటంతో.. మురుగునీరు ఇళ్లల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్నామని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

sewage problems
మురుగునీరు

By

Published : Aug 31, 2021, 12:08 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలను మురుగు కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే.. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమై.. రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. ప్రతి ఏటా డ్రైనేజీల నిర్వహణకు.. లక్షల్లాది రూపాయలు వెచ్చించినా.. పనులు చేపట్టడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. అనేక కాలనీల్లో మురుగునీరు ఇళ్లల్లోకి చేరి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం వల్ల దుర్వాసన వ్యాపిస్తోంది. కరోనాకి తోడు వర్షాకాలం కావడంతో.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు చెత్తను సేకరించి.. మురుగు నీటి వ్యవస్థను బాగు చేయాలని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details