అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో.. రైతులు తమ పంట రుణాలునవీకరణ కోసం వందల సంఖ్యలో నిత్యం బ్యాంకులకు వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను విస్మరిస్తున్నారు.
మండుటెండలో నిలుచోలేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోడానికి రైతులు తమ వద్ద ఉన్న హెల్మెట్లు, చెప్పులు, చేతి సంచులను.. పోలీసులు, సిబ్బంది బ్యాంకు ముందు గీయించిన బాక్సుల్లో పెడుతున్నారు.