అనంతపురం జిల్లా పెనుకొండలో విషాదం జరిగింది. 8వ తరగతి విద్యార్థి కాలు నాయక్.. ఉప్పువంక వాగులో కాలు జారి పడిపోయాడు. స్థానిక జిప్సీ హాస్టల్కు చెందిన విద్యార్థులు.. వార్డెన్ బీమా నాయక్ తో కలిసి ఈతకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ వైద్యశాలకు తరలించారు.
విహారయాత్రలో విషాదం... వాగులో పడి విద్యార్థి మృతి
పెనుకొండలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పువంక వాగులో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది ప్రథమ చికిత్స చేసినా.. ప్రాణాలు దక్కలేదు.
వాగులో పడి విద్యార్థి మృతి చెందాడు.