ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CRIME NEWS: కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు...నలుగురు అరెస్టు - అనంతపురం జిల్లా నేర వార్తలు

CRIME NEWS: ఫిబ్రవరి 25న అనంతపురం జిల్లా పెనుకొండలో కిడ్నాప్​కు గురైన గణేశ్ కేసును పోలీసులు చేధించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

మాట్లాడుతున్న డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ

By

Published : Feb 28, 2022, 4:43 PM IST


CRIME NEWS: అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ నెల 25న కిడ్నాప్​కు గురైన గణేశ్ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ రమ్య తెలిపిన వివరాల ప్రకారం పెనుకొండ మండలం పరమేశ్వరపురం వద్ద ఈ నెల 25వ తేదీన గణేశ్ అనే యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం గణేశ్ తండ్రికి ఫోన్ చేసి రూ. 3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువకుని తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. ఆదివారం పెనుకొండ మండలంలోని గోనిపేట అటవీ ప్రాంతంలో నలుగురు నిందితులు రాజేశ్​నాయక్, సుభానుల్లా, శంకర్ నాయక్, వినోద్ నాయక్​లను అరెస్టు చేశారు.

ఈ నలుగురు కియా అనుబంధ పరిశ్రమ సంఘ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎలాగైన డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గణేశ్ ని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ పోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఆమె అభినందించారు.

ఇదీ చదవండి:'బాంబుల మోత.. విద్యార్థినులపై సైన్యం వేధింపులు.. ఇంటికెప్పుడు వెళ్తామో!'

ABOUT THE AUTHOR

...view details