అనంతపురం జిల్లాలో పెనుకొండ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు ముందుగా స్టాళ్ళను పరిశీలించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. పెనుగొండ అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమయిందని మంత్రి సునీత అన్నారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.