ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pensions Problems: సాంకేతిక లోపం..పెన్షన్​దారులకు శాపం - అనంతలో పింఛన్లు అందక లబ్ధిదారుల అవస్థలు

పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానం వల్ల అర్హులైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పట్ల శాపంగా మారుతున్నాయి.

సాంకేతిక లోపం..పెన్షన్​దారులకు శాపం
సాంకేతిక లోపం..పెన్షన్​దారులకు శాపం

By

Published : Sep 10, 2021, 7:58 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అగళి మండలంలోని రాగేలింగనహళ్ళి, నందరాజనపల్లి, ఇరిగేపల్లి గ్రామాల్లోని లబ్ధిదారులకు గత రెండు నెలలుగా పింఛన్లు నిలిచిపోయాయి. గతంలో వేలిముద్రలు పడని వారికి అధికారుల వేలిముద్రలతో ఫించన్ సొమ్ము పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలకటంతో లబ్ధిదారులు వేలముద్ర నమోదు కోసం ఆధార్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల వారి వేలిముద్రలు ఆధార్ కేంద్రంలో నమోదు కాకపోవటంతో వారు ఫించన్లు పొందలేకపోతున్నారు.

అర్హత ఉన్నా..అందని పెన్షన్

అన్ని అర్హతలు ఉన్నా..ఫించన్లు అందకపోవటంతో సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఫించన్లు నిలిపివేయటం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. వేలి ముద్రలతో సంబంధం లేకుండా తమ అర్హతలపై సమగ్ర విచారణలు జరిపి తిరిగి పెన్షన్లను పునరుద్ధరించాలని బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details