Pensioners Agitation: పదవీ విరమణ పింఛన్ పంపిణీలో జాప్యంపై అనంతపురంలో విశ్రాంత ఉద్యోగులు నిరసన తెలిపారు. పదో తేదీ వస్తున్నా పింఛన్ అందడం లేదంటూ కలెక్టరేట్ ఆవరణలోని ట్రెజరీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి దుస్థితి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీని గురించి అడిగితే ట్రెజరీ అధికారుల నుంచి సరైన స్పందన లేదని విశ్రాంత ఉద్యోగులు వాపోయారు.
పదో తేదీ వచ్చినా పింఛన్ రాలేదని.. అనంతలో విశ్రాంత ఉద్యోగుల నిరసన - Protest of retired employees
Pensioners Agitation: పదో తేదీ వచ్చినా తమకు అందాల్సిన పింఛన్ అందలేదని.. విశ్రాంత ఉద్యోగులు అనంతపురంలో నిరసన తెలిపారు. పింఛన్ పంపిణీలో జాప్యం చేస్తున్న ఇంతటీ దారుణమైన ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని వాపోయారు.
విశ్రాంత ఉద్యోగుల నిరసన
"ఒకటో తేది పోయింది... రెండో తేదీ పోయింది... చివరికి పదో తేదీ వచ్చింది. అయినా పింఛన్ అందలేదు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలో ఇంతా నిర్లీప్తతా మేము ఏ ప్రభుత్వంలో చూడలేదు. మాకు సరైన వైద్యం లేదు, సరైన పింఛన్ లేదు." -జయరామప్ప, పింఛనర్ల సంఘం జిల్లా కార్యదర్శి
ఇవీ చదవండి: