అనంతపురంలో జిల్లా మడకశిరలో వృద్ధులు, వికలాంగులకు పింఛను పాట్లు తప్పటం లేదు. మూడో తేదీ వచ్చినా.. ఇంకా పెన్షన్ అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎవరూ రాలేదని వాపోతున్నారు. పింఛను రాకపోవడం వల్ల మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. అధికారులు స్పందించి పెన్షన్ అందించాలని వేడుకుంటున్నారు.
వృద్ధులు, వికలాంగులకు తప్పని పింఛను పాట్లు..! - Pension struggles in anantapur
వృద్ధులు, వికలాంగులకు పింఛను పాట్లు తప్పటం లేదు. అనంతపురంలో జిల్లా మడకశిరలో ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందిస్తారని చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎవరూ రాలేదని వృద్ధులు వాపోతున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని పింఛను కోసం పడిగాపులు కాస్తున్నారు.
వృద్ధులు, వికలాంగులకు తప్పని పింఛన్ పాట్లు