ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం : పింఛన్ అందక బాధితుని అవస్థలు - అనంతపురం జిల్లాలో నేటి వార్తలు

అనంతపురం జిల్లా సామలపల్లిలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. బతికున్న వృద్ధుడు చనిపోయినట్లుగా రికార్డుల్లో చూపి 2 నెలలుగా పింఛన్ నిలిపివేశారు. ఈ ఘటనపై బాధితుడు.. అధికారులకు ఫిర్యాదు చేయగా... సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

pension holder old man problems in samalapalli ananthapuram district
అధికారుల నిర్లక్ష్యం : పింఛన్ అందక బాధితుని అవస్థలు

By

Published : Oct 5, 2020, 5:22 PM IST

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం సామలపల్లి గ్రామానికి చెందిన నిడిమామిడప్ప అనే వృద్ధుడు.. బతికి ఉన్నప్పటికీ... పింఛన్ రికార్డులో చనిపోయినట్లు పేరు నమోదైంది. ఫలితంగా రెండు నెలలుగా పింఛన్ సొమ్ము అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఈ విషయంపై గోరంట్ల ఎంపీడీవో అంజినప్పకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎంపీడీఓ... వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి బాధితునికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

ఇకపై రోజూ విచారణ.. అవసరమైతే ప్రత్యక్షంగా..!

ABOUT THE AUTHOR

...view details