అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని హుండీలను బుధవారం ఆలయ అధికారుల సమక్షంలో సేవకులు లెక్కించారు. రెండు నెలలకు సంబంధించి హుండీల ద్వారా ఆలయానికి రూ.7.02లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో రమేష్‌బాబు తెలిపారు. కరోనా వ్యాప్తి సమయంలో కూడా భక్తులు హుండీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చారని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఆదాయం కొంత తగ్గినప్పటికీ కరోనా సమయంలో.. అదీ రెండు నెలల్లో 7 లక్షలు రావడం విశేషమని ఈఓ అన్నారు.
పెన్నహోబిలం హుండీ ఆదాయం రూ.7 లక్షలు - పెన్నహోబిలంపై వార్తలు
అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ సొమ్మును బుధవారం లెక్కించారు. రెండు నెలలకు రూ.7 లక్షల 2100 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రమేష్‌బాబు తెలిపారు.

పెన్నహోబిలం హుండీ లెక్కింపు
లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రామతులసి పర్యవేక్షించారు. గత రెండు నెలల కాలంలో భక్తులు సమర్పించిన తలనీలాలను ఆలయ అధికారులు వేలం వేయగా, వాటిని గుత్తేదారుడు రూ.3,500 దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: పేలిన సిలిండర్- త్రుటిలో..!