ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణాలు తొలగించవద్దంటూ చిరు వ్యాపారుల ఆందోళన - పెనుకొండ పట్టణం తాజా వార్తలు

పెనుకొండ పట్టణం దర్గా కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. 20 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న తమను నగర పంచాయతీ అధికారులు అర్ధాంతరంగా ఖాళీ చేయమని చెప్పడం దారుణమన్నారు. దుకాణాలను తొలగించడానికి వీళ్లేదంటూ నిరసన బాట పట్టారు.

penkonda town shopkeepers protest at darga centre in ananthapur district
దర్గా కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు ఆందోళన

By

Published : Aug 28, 2020, 6:50 PM IST

పెనుకొండ పట్టణంలోని దర్గా కూడలి వద్దనున్న చిరు వ్యాపారులు శుక్రవారం నిరసన బాట పట్టారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. గత 20 ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్న తమను రెండు రోజుల క్రితం నగర పంచాయతీ అధికారులు దుకాణాలు తొలగించాలని ఆదేశించారన్నారు. దుకాణాలు తొలగిస్తే తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details