ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DIED: నీటిలో మునిగి పెద్దకోట్ల గ్రామ వీఆర్వో మృతి.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

DIED: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీఏబీఆర్ జలాశయంలో మునిగి ఓ వీఆర్వో మృతి చెందారు. అనంతపురానికి చెందిన నూర్ మహమ్మద్.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు.

DIED
నీటిలో మునిగి పెద్దకోట్ల గ్రామ వీఆర్వో మృతి

By

Published : Jun 20, 2022, 12:22 PM IST

DIED: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీఏబీఆర్ జలాశయంలో మునిగి ఓ వీఆర్వో మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురానికి చెందిన నూర్ మహమ్మద్.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. మిత్రులతో కలిసి సరదాగా.. పీఏబీఆర్ జలాశయానికి వచ్చారు. భోజనం అనంతరం వీఆర్వో నూర్ మహమ్మద్, అతని మిత్రుడితో కలిసి నీటిలో దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో.. ఇద్దరు నీటిలో మునిగిపోయారు. మోహిత్ సురక్షితంగా బయటికి రాగా.. నూర్ మహమ్మద్​కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి పోయాడు. వెంటనే ఇతర మిత్రులు అతడిని నీటి నుంచి బయటికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details