అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం చెన్నేకొత్తపల్లి కెనరా బ్యాంకు వద్ద రైతులు ధర్నా చేశారు. నాలుగో విడత రుణమాఫీ నగదు వెంటనే ఇవ్వాలంటూ రైతు సంఘం అధ్యక్షుడు పెద్దన్న ఆధ్వర్యంలో లో ధర్నా చేపట్టారు. తీసుకున్న రుణాల వడ్డీ మాత్రం కట్టించుకుని రెన్యువల్ చేయాలంటూ బ్యాంకు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అప్పు చెల్లించే స్థోమత లేక దళారులను ఆశ్రయించడంతో మరిన్ని కష్టాల పాలవుతున్నట్లు వాపోయారు. స్పందించిన బ్యాంక్ మేనేజర్... ఉన్నతాధికారులతో చర్చించి వారం రోజుల్లోపు రైతు నుంచి వడ్డీ కట్టించుకుని రుణాలు రెన్యువల్ చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో బ్యాంకు ఎదుట రైతుల ధర్నా - peasants protest at bank
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి కెనరా బ్యాంకు వద్ద రైతులు ధర్నా చేశారు. రైతులు తీసుకున్న రుణాల వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేయాలంటూ.. బ్యాంకు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.
![అనంతపురం జిల్లాలో బ్యాంకు ఎదుట రైతుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3172480-973-3172480-1556809598817.jpg)
రైతులు ధర్నా