రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట వేరుశనగ. దిగుబడి చేతికొచ్చే వేళ ఎగతెగని వర్షాలతో పంట దెబ్బతింది. రాయలసీమ 4 జిల్లాల్లో దాదాపు 26 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేయగా.. అనంతపురం జిల్లాలోనే 12.20 లక్షల ఎకరాల్లో సాగైంది. గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన రైతు సేవ్యానాయక్ తన ఐదెకరాల్లో వేరుశనగ వేశారు. సాధారణంగా ఒక్కో ఎకరాకు 25-30 బస్తాల కాయలు వచ్చేవి. అధిక వర్షాల వల్ల నీరు నిలిచి వేరు బలపడక.. కాయ ఎదగక.. ఐదారు బస్తాలు కూడా రాలేదని వాపోయాడు.
వరుణుడి జడి.. అరకొర దిగుబడి - అనంతపురంలో వేరుసెనగ పంట నష్టం తాజా వార్తలు
ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు రాయలసీమలో కొన్ని పంటలు నాశనం అయ్యాయి. పంట చేతికొచ్చేవేళ..వానలు పడటంతో రైతన్నకు తీవ్రనష్టం వాటిల్లింది.
రాయలసీమలో వేరుసెనగ పంట