అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక నెమలి మృత్యువాత పడింది. మధు, రవి అనే యువకులు తిమ్మావురం నుంచి వస్తూ గాయపడ్డ నెమలిని గమనించి.. కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగా నెమలి మృతి చెందినట్లు పశు వైద్యశాల సిబ్బంది తెలిపారు. అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని నెమలి మృతి - yerravalli peacock died in accident
గుర్తు తెలియని వాహనం ఢీకొని నెమలి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ఎర్రంపల్లిలో జరిగింది.
ఎర్రవల్లిలో వాహనం ఢీకొని నెమలి మృతి