అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామ సమీపంలోని పొలాల్లో నెమలి దొరకడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకొని నెమలి స్వాధీనం చేసుకున్నారు. మయూరాన్ని పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నెమలికి అటవీశాఖ అధికారులు వైద్యం అందించి కోలుకున్న తర్వాత అడవుల్లోకి విడిచి పెడతామని తెలిపారు.
పొలాల్లో దొరికిన మయూరం.. అటవీ అధికారులకు అప్పగింత - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం జిల్లా బొందలవాడలో స్థానికులకు పొలాల్లో నెమలి దొరికింది. ఆ మయూరాన్ని వారు .. అటవీ అధికారులకు అప్పగించారు.
![పొలాల్లో దొరికిన మయూరం.. అటవీ అధికారులకు అప్పగింత peacock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10365708-709-10365708-1611500311082.jpg)
స్థానికులకు పొలాల్లో దొరికిన నెమలి.. అటవీ అధికారులకు అప్పగింత