అనంతపురం జిల్లా ధర్మవరంలో జనావాసాల మధ్య నెమలి ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతాల్లో సంచరించే నెమలి ధర్మవరం పట్టణంలోని పిఆర్టి వీధిలోనున్న ఉపాధ్యాయుడి ఇంటి ఆవరణంలో కనిపించింది. స్థానికులు నెమలిని చూసేందుకు ఆసక్తిగా తరలివచ్చారు. పట్టణ పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అటవీ సిబ్బంది నెమలిని పట్టుకున్నారు. ధర్మవరం మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో నెమళ్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. నీటికి ఇబ్బంది అయిన కారణంగానే.. పట్టణంలోకి నెమలి వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ధర్మవరంలో నెమలి... అటవీ అధికారులకు అప్పగింత - dharmavaram
అనంతపురం జిల్లా ధర్మవరంలో పీఆర్టీ వీధిలో నెమలి ప్రత్యక్షమైంది. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు నెమలిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
ధర్మవరం పట్టణ వీధిలో ప్రత్యక్షమైన నెమలి